- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్‌కు శ్రేయా ఘోషల్ ఫిదా
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 దూసుకుపోతుంది... Shreya Ghoshal have a surprise to a contestant name Sowjanya in Telugu Indian Idol season-2

దిశ, సినిమా: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 దూసుకుపోతుంది. కంటెస్టెంట్స్ టాలెంట్‌కు అటు ఆడియెన్స్‌తోపాటు ఇటు సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. కాగా గత ఎపిసోడ్‌లో సౌజన్య అనే కంటెస్టెంట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలోని ‘ఎకిమీడా నా జత విడి’ అనే పాట పాడింది. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సౌజన్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ పాట క్లిప్‌ను ఒరిజినల్‌గా ఈ సాంగ్ పాడిన శ్రేయా ఘోషల్‌కు పంపిస్తానని మాట ఇచ్చాడు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఆ క్లిప్‌ను శ్రేయాకు పంగా.. సౌజన్య పర్ఫార్మెన్స్‌ను మెచ్చిన శ్రేయా చిన్న సర్‌ప్రైజ్ వీడియో పంచుకుంది. ఈ వీడియోలో.. ‘సౌజన్య నువ్వు ఈ పాట చాలా బాగా పాడావు. నా ఫ్రెండ్ తమన్.. నువ్వు పాడిన ఈ క్లిప్‌ను నాకు పంపించారు. నీ వాయిస్ చాలా బాగుంది. వింటుంటే ఏదో నదిలో నీరు పాడుతున్నట్లు అనిపించింది. నీ నుంచి మరిన్ని పాటలు వినాలనుకుంటున్నాను. లవ్ యూ సో మచ్’ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పింది.
Also Read..






