ఒక్క సినిమాతో సంచలనం.. హాట్ లుక్‌తో నెట్టింట మంట పెట్టేసిన యంగ్ బ్యూటీ!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-10 05:47:48  IST  )

‘నాన్న’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి మనసులు గెలుచుకుంది సారా అర్జున్(Sara Arjun).

ఒక్క సినిమాతో సంచలనం.. హాట్ లుక్‌తో నెట్టింట మంట పెట్టేసిన యంగ్ బ్యూటీ!
X

దిశ, సినిమా: ‘నాన్న’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి మనసులు గెలుచుకుంది సారా అర్జున్(Sara Arjun). ఆ తర్వాత వరుస సినిమాలతో తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. చిన్న వయసులోనే కెమెరా ముందు సహజంగా నటించే ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తాజాగా హీరోయిన్‌గా మారి మరోసారి సంచలనం సృష్టించింది. రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ధురంధర్’ (Dhurandhar)సినిమాతో సారా అర్జున్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ వంటి స్టార్ క్యాస్ట్ మధ్య కూడా సారా తన పాత్రతో ఆకట్టుకోవడం విశేషం.

గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా, భారీ వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రంతో సారా అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. నటనతో పాటు లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలోనూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక్క సినిమాతోనే ఇంతటి పాపులారిటీ దక్కించుకోవడం అరుదైన విషయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెను ఓపెన్‌గా ప్రశంసించడంతో సారా పేరు మరింతగా వైరల్ అవుతోంది. ఇక ఈ క్రేజ్‌ను సోషల్ మీడియాలో కూడా బాగా క్యాష్ చేసుకుంటోంది సారా అర్జున్. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ స్టైలిష్ ఫొటోషూట్లను షేర్ చేస్తోంది.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అవి కాస్త నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో స్లీవ్‌లెస్ రెడ్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె వీపంతా చూపిస్తూ రెచ్చిపోయింది. హాట్ లుక్స్‌తో మత్తెక్కించే చూపులతో నెట్టింట మంట పెట్టేసింది. వాటిని చూసిన కుర్రకారుకు చెమటలు పడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. చెమటలు పట్టిన వ్యక్తి గాలి ఊపుకుంటున్న మీమ్ షేర్ చేస్తూ.. ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు. మొత్తానికి ‘ధురంధర్’ తర్వాత సారా అర్జున్ కెరీర్ కొత్త ట్రాక్‌లోకి వెళ్లిందనే చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుందోనన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.

Read More..

భయంకర అనుభవాలు హీరోయిన్లకే కాదు హీరోలకు కూడా జరుగుతాయి.. చిత్రాంగద సింగ్ షాకింగ్ కామెంట్స్

Next Story