ఆమె దృఢ సంకల్పం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. శర్వరీ

by Disha Web Desk 16 |
ఆమె దృఢ సంకల్పం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. శర్వరీ
X

దిశ, సినిమా: బీటౌన్ బోల్డ్ బేబీ శర్వరీ వాఘ్ సహనటి కియారా అద్వానీపై ప్రశంసలు కురిపించింది. రీసెంట్‌గా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కియారా సినీ ప్రయాణం తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పింది. ఆమె దృఢ సంకల్పాన్ని చూస్తే తనకు ఆశ్యర్యం కలుగుతోందన్న ఆమె.. తనతోపాటు ఈ తరం నటీమణులకు కియరా జర్నీ ప్రేరణగా నిలుస్తుందని, తన కృషి, పట్టుదలకు కొత్తపేరు పెడతానని చెప్పింది. ఇక చాలా కాలం వరకు ప్రజలు గుర్తించలేని సినిమాల్లో భాగమైన నటి.. తనను తాను మెరుగుపరుచుకుంటూ, అద్భుతమైన పనితీరు, బలమైన సంకల్పంతో ఈ రోజు టాప్ మోస్ట్ యాక్ట్రెస్‌లో నిలిచినందుకు పొగడకుండా ఉండలేననని పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. శర్వరి వాఘ్ చివరిగా సిద్ధాంత్ చతుర్వేది, రాణి ముఖర్జీ, సైఫ్ అలీ ఖాన్‌ల సినిమా 'బంటీ ఔర్ బాబ్లీ 2'లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి :

నాలుగు నెల‌ల ప్రెగ్నెన్సీతో.. ఆ పాటకు డ్యాన్స్ చేసిన రమ్యకృష్ణ..

వివాదంలో ఆదిపురుష్.. ఢిల్లీ కోర్టులో పిటిషన్


Next Story