శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్?

by Sujitha Rachapalli |

ప్రముఖ దర్శకుడు శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘వెల్పరి’ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కోలీవుడ్‌లో ఇందుకు సరిపోయే కాస్టింగ్ లేకపోవడంతో టాలీవుడ్‌పై ఫోకస్ చేసినట్లు టాక్. అవతార్ లెవల్ టెక్నాలజీ,

శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్?
X

దిశ, సినిమా : ప్రముఖ దర్శకుడు శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘వెల్పరి’ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కోలీవుడ్‌లో ఇందుకు సరిపోయే కాస్టింగ్ లేకపోవడంతో టాలీవుడ్‌పై ఫోకస్ చేసినట్లు టాక్. అవతార్ లెవల్ టెక్నాలజీ, భారీ బడ్జెట్‌తో వెండితెరపై ఆవిష్కరించబోయే చిత్రానికి పాన్ ఇండియా మార్కెట్ కచ్చితంగా కావాల్సిందే. అందుకే డైరెక్టర్ టాలీవుడ్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబులను సంప్రదించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. అప్పుడే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు తగిన న్యాయం జరుగుతుందనే ఆలోచన ఉందట. కానీ ఇద్దరు హీరోలు ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో సినిమా వారితో చేసేందుకు వెయిట్ చేస్తాడా లేక మరో హీరోను ఎంచుకుంటాడా చూడాల్సి ఉంది.

Next Story