- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సినిమాను ప్రకటించిన శంకర్.. ప్రపంచమంతా దీన్ని గుర్తింస్తుందంటూ హైప్ పెంచుతున్న కామెంట్స్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)ఇటీవల తెరకెక్కించిన గేమ్ ఛేంజర్(Game changer), ఇండియన్-2 వంటి చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)ఇటీవల తెరకెక్కించిన గేమ్ ఛేంజర్(Game changer), ఇండియన్-2 వంటి చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం తెలిసిందే. కానీ ఊహించనంతగా మెప్పించలేక బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. అంతేకాకుండా నెటిజన్ల చేత ట్రోల్స్‌కు గురయ్యాయి. ఇక అప్పటినుంచి ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ఒకప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘రోబో’ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ‘వేల్పారి’(Velpari) ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటివరకు చేసిన అతిపెద్ద చిత్రాల్లో ఇది ఒకటి అవుతుంది. దీనికి భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిజైన్స్, టెక్నాలజీ అవసరం ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ వంటి మూవీస్‌కు ఉపయోగించిన సాంకేతికను పరిచయం చేయనున్నాను. ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తుందనుకుంటున్నా. త్వరలో నా కల నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు ఇలాగే హైప్ పెంచావ్ విడుదల తర్వాత ఏమైంది.. అంటూ ట్రోల్ చేస్తున్నారు.






