షారూఖ్ 'జవాన్' టీజర్ విడుదల ఎప్పుడంటే..?

by Disha Web Desk 1 |
షారూఖ్ జవాన్ టీజర్ విడుదల ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో సౌత్ దర్శకుడు అట్లీతో ఒక సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ను మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కింగ్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ పక్కా ప్లాన్ చేస్తోందని సమాచారం. అదేవిధంగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చుతున్నారు.

Next Story