వాళ్లకోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను: రాఘవేంద్రరావు!

by Disha Web Desk 7 |
వాళ్లకోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను: రాఘవేంద్రరావు!
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన లెంజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీకి రాఘవేంద్రరావు లాంచ్ చేసిన హీరో హీరోయిన్లు ప్రస్తుతం టాప్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వానికి కాస్త దూరమైనప్పటికీ.. ఆయన దర్శక పర్యవేక్షణలో సినిమాలు తెరకెక్కుతున్నాయి.

ఇక రీసెంట్‌గా రాఘవేంద్రరావు 'కేఆర్ఆర్ వర్క్స్' పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ ఛానల్‌ను రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే రాఘవేంద్రరావు ఈ ఛానల్ పెట్టడానికి ఒక కారణం ఉందట. 'టాలెంట్ ఉండి అవకాశాలు లేక వెండి తెరకు దూరమైన వారున్నారు. అలాంటి వారికి నా యూట్యూబ్ ఛానల్ ఒక మంచి ఫ్లాట్ ఫామ్ కానుంది. అందుకే ఈ ఛానల్ ప్రారంభించా' అని తెలియజేశారు.

READ MORE

షూటింగ్‌లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్.. ఆందోళనలో అక్షయ్ ఫ్యాన్స్



Next Story

Most Viewed