కమల్ హాసన్ నన్ను చీట్ చేశాడు.. ఒక్కసారి కాదు చాలా సార్లు అలా చేశాడు... సీనియర్ నటి సంచలన ఆరోపణలు

by Sujitha |
కమల్ హాసన్ నన్ను చీట్ చేశాడు.. ఒక్కసారి కాదు చాలా సార్లు అలా చేశాడు... సీనియర్ నటి సంచలన ఆరోపణలు
X

దిశ, సినిమా : లోకనాయకుడు కమల్ హాసన్ నటనలో రోల్ మోడల్ కానీ పర్సనల్ లైఫ్ లో ఫ్లాప్ స్టార్ అంటుంటారు విశ్లేషకులు. లిప్ లాక్స్, రిలేషన్ షిప్స్ విషయంలో చెడ్డ పేరు మూటగట్టుకున్న ఆయన.. నటి గౌతమితో 13ఏళ్లు సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు ఇన్నేళ్ళు కలిసి ఉన్నారు. ఈ టైంలో గౌతమి క్యాన్సర్ తో పోరాటంలో మద్దతు ఇచ్చాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో విడిపోతున్నామని ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. కానీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మీడియా ముందు ఓపెన్ కాలేదు. అయితే తాజా ఇంటర్వ్యూలో నటి ఈ విషయం గురించి మాట్లాడింది.

'తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి.. ఇలా ఏ బంధంలోనైనా ఇద్దరి బాధ్యతలు సమానంగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఒకవేళ లేకపోతే మూడు, నాలుగు సార్లు ఓపిక పడుతారేమో కానీ పదే పదే ఇందుకు ఒప్పుకోరు. చీటింగ్ యాక్సెప్ట్ చేయరు. తమ రిలేషన్ కూడా అంతే. తప్పు చేయడం అనేది అలవాటుగా మారితే ఎవరు మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు. ఇది కరెక్ట్ కాదు' అని చెప్పుకొచ్చింది గౌతమి. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అంటే కమల్ హాసన్ మోసం చేశాడని చెప్తుందా అని కామెంట్ చేస్తున్నారు. ఒకటి కాదు చాలాసార్లు చేశాడట అని మరొకరు అంటే ప్రూఫ్ లాంటివి ఉన్నాయా అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.

Next Story