- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి వారిని చూస్తుంటే నాకు భయమేస్తుంది.. జాగ్రత్తగా ఉండాలంటూ రకుల్ హెచ్చరిక (పోస్ట్)
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్(Rakul Preet Singh) పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్(Rakul Preet Singh) పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె పేరుతో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు పెరుగుతుండటంపై రకుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం ఆమె వాట్సాప్ నెంబర్ ఇదేనంటూ కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో రకుల్ షాక్‌కు గురైంది. వెంటనే ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టత ఇచ్చినా.. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పింది. తాజాగా, ఓ వ్యక్తి రకుల్ శరీర మార్పులకు కారణం ప్లాస్టిక్ సర్జరీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం మరో వివాదానికి దారితీసింది.
ఆమె సన్నబడటానికి సర్జరీ చేయించుకుందని చెబుతూ.. ఓ డాక్టర్ వీడియోను షేర్ చేసి ప్రచారం చేశాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవడంతో నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని రకుల్ ఖండించింది. ఈ విషయంపై స్పందించిన రకుల్ ప్రీత్‌సింగ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. “వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు ప్రజలను తప్పుడు సమాచారంతో తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలాంటి వారిని చూస్తుంటే నిజంగానే నాకు భయంగా ఉంది. నేను ఆయుర్వేదం లాంటి పురాతన పద్ధతులను కూడా నమ్ముతాను.
అదే సమయంలో ఆధునిక వైద్య శాస్త్రానికీ గౌరవం ఇస్తాను. ఎవరైనా సర్జరీ చేయించుకుంటే అది వారి వ్యక్తిగత విషయం.. దానిపై నేను ఎవరినీ తప్పుపట్టను. కానీ నా గురించి అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం అసహ్యంగా ఉంది. కష్టపడి వ్యాయామం చేసినా బరువు తగ్గొచ్చనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. గాయ్స్.. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి” అంటూ అభిమానులకు హెచ్చరిక చేసింది. తనపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి వీడియోను కూడా ఆమె పోస్ట్‌కు జత చేయడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.






