- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' నుంచి సెకండ్ సాంగ్..
by Vinod kumar |
‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ నుంచి సెకండ్ లిరికల్ రిలీజ్ చేశారు మేకర్స్.

X
దిశ, సినిమా: 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' నుంచి సెకండ్ లిరికల్ రిలీజ్ చేశారు మేకర్స్. కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. సాంగ్ లాంచింగ్ ఘనంగా నిర్వహించారు. 'నమ్ముకోరా.. నమ్ముకోరా' అంటూ సాగే పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని చేతుల మీదుగా పాట విడుదల కాగా.. నిర్మాత సి. కల్యాణ్, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. సోహెల్, మృణాళిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లో రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన సినిమాను నిర్మిస్తున్నారు.
Next Story






