రెండో రోజూ సెన్సేషనల్ గ్రాస్ రాబట్టిన ‘ది కేరళ స్టోరీ’

by Disha Web Desk 10 |
రెండో రోజూ సెన్సేషనల్ గ్రాస్ రాబట్టిన ‘ది కేరళ స్టోరీ’
X

దిశ, సినిమా: తాజాగా హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఎన్నో వివాదాల నడుమ మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమాను నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో.. భారీ బందోబస్తు మధ్య సినిమాను ప్రదర్శించారు. ఇక అనుకున్నట్టుగానే ఈ మూవీ సెన్సేషనల్ హిట్ తరహాలోనే సాలిడ్ మౌత్ టాక్ తెచ్చుకోగా, మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక రెండో రోజు కలెక్షన్ చూసుకుంటే రూ. 2 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు సమాచారం. ఓ పక్క షోలు నిలిపివేయాలనే డిమాండ్ పెరుగుతుండగా.. మరో వైపు మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమా షోలు రద్దు

Next Story

Most Viewed