అఖండ 2 లో ఐటమ్ సాంగ్... రంగంలోకి మెగా బ్యూటీ?

by velandi.Saikiran |

నందమూరి బాలయ్య ( Nandamuri Balayya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో.. యంగ్ హీరోలకు

అఖండ 2 లో ఐటమ్ సాంగ్... రంగంలోకి మెగా బ్యూటీ?
X

దిశ, వెబ్ డెస్క్ : నందమూరి బాలయ్య ( Nandamuri Balayya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో.. యంగ్ హీరోలకు పోటీగా నందమూరి బాలయ్య దూసుకు వెళ్తున్నారు. ప్రతి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకుంటున్నారు నందమూరి బాలయ్య. అలాంటి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమాతో తాండవం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

బోయపాటి శ్రీనివాస్ (Boyapati Srinivas) అలాగే నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చిన థియేటర్లు బ్లాస్ట్ కావాల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో అఖండ మొదటి భాగం వచ్చి సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తీస్తున్నారు. అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్లతో పాటు కాస్త రొమాంటిక్ సీన్స్ కూడా పెట్టే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఓ ఐటెం సాంగ్ కూడా.. ఇందులో ఉండబోతుందని చెబుతున్నారు.

అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఏకంగా సంయుక్త మీనన్ ( Samyuktha Menon) ను రంగంలోకి దింపుతున్నారట బోయపాటి శ్రీనివాస్. చూడడానికి సంయుక్త మీనన్ ఫ్యామిలీ హీరోయిన్ లాగా ఉంటుంది. అలాంటి సంయుక్త మీనన్ ఐటమ్ సాంగ్ చేస్తే.. జనాల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. అందుకే సంయుక్త మీనన్ తో భారీ ప్లాన్ చేస్తున్నారట బోయపాటి శ్రీనివాస్. సమంత అలాగే తమన్నా లాంటి హీరోయిన్లు చేసినప్పుడు... సంయుక్త మీనం చేస్తే తప్పేమీ లేదని కూడా జనాల నుంచి మంచి టాక్ వస్తుంది. మరి దీనిపై.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story