- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీలింగ్స్‌ను తట్టుకోలేకపోతున్న సంయుక్తా మీనన్.. ఆ ఫొటోలు రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
యంగ్ హీరోయిన్ సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సంయుక్తా మీనన్‌కు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఈ బ్యూటీ నటించిన బింబిసార, సార్, విరూపాక్ష సూపర్ హిట్స్‌గా నిలవడంతో అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది. అయితే సంయుక్తా మీనన్‌కు ఆఫర్లు వస్తున్నా అన్నింటికి రిజెక్ట్ చేస్తుందట. తన నచ్చిన పాత్ర కోసం వెయిట్ చేస్తుంది.
ఖాళీగా ఉండకుండా పలు యాడ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, సంయుక్తా మీనన్ గ్రీన్ కలర్ డ్రెస్సులో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి ఇంట్రెస్టింగ్ కొటేషన్ షేర్ చేసింది. ‘‘భావాలు అలల వంటివి. అవి రాకుండా అదుపు చేయలేము. కానీ వాటిలో దేనిని తుడిచేయాలనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్టును చూసిన నెటిజన్లు సేమ్ సమంతలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.
- Tags
- Samyuktha Menon






