Samantha: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న సమంత-రాజ్ నిడిమోరు.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-01 07:37:59  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది.

Samantha: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న సమంత-రాజ్ నిడిమోరు.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. నేడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరిద్దరు ఒక్కటయ్యారు. ఈ వివాహం అతికొద్ది మంది సమక్షంలో జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఇందులో సమంత పూర్తిగా రెడ్ కలర్ చీర కట్టుకుని కనిపించి అందరి దృష్టిని ఆకర్షించగా.. రాజ్ అందుకు తగినట్లుగా రెడీ అయ్యాడని తెలుస్తోంది. మొదటి వీరిద్దరు లింగ భైరవ ఆలయంలో స్వామి దర్శనం చేసుకుని పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో అది తెలుసుకున్న వారంతా షాక్‌కు గురవుతున్నారు. మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇక ఈ విషయాన్ని ఈ జంట త్వరలోనే అధికారికంగా ప్రకటించి సినీ ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఇది సమంతకు, రాజ్ నిడిమోరుకు రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇప్పటికే రాజ్‌ శ్యామాలిదేను 2015లో పెళ్లి చేసుకోగా.. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఇక ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి రాజ్ సమంతతో రిలేషన్‌ను కొనసాగిస్తున్నాడు.

ఆమెతో ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడట. ఇన్నాళ్లకు వీరిద్దరు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఇక సమంత విషయానికొస్తే.. ఆమెకి కూడా ఇది రెండో పెళ్లి. ‘ఏ మాయ చేసావే’ చేసావే సినిమాతో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొద్ది రోజులకే గొడవలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు. నాగచైతన్య మాత్రం శోభితను రెండో పెళ్లి చేసుకోగా.. కొద్ది కాలంపాటు ఒంటరిగానే ఉన్న సమంత మయోసైటీస్‌ నుంచి కోలుకుని తన లైఫ్‌పై ఫోకస్ పెట్టింది. అలాగే రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడిపింది. గత కొద్ది కాలంగా ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ స్పందించకుండా పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది.

Next Story