లోకేష్ దర్శకత్వంలో సమంత కొత్త మూవీ.. ఇక ఇండస్ట్రీ షేక్ కావాల్సిందే ?

by velandi.Saikiran |

లోకేష్ కనకరాజు తన దర్శకత్వంలో సమంతతో ఒక సినిమా.. సమంతతో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు పెద్ద స్కెచ్ వేశారట

లోకేష్ దర్శకత్వంలో సమంత కొత్త మూవీ.. ఇక ఇండస్ట్రీ షేక్ కావాల్సిందే ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు అయినప్పటికీ హీరోయిన్ సమంతాను బీట్ చేసే అంత పెద్ద హీరోయిన్ ఎవరు రాలేదు. ఆమె హీరోయిన్ గా అలాగే లీడ్ రోల్ సినిమాలు కూడా చేసింది. ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలు కూడా చేస్తోంది. అదే సమయంలో వ్యాపారాలు మొదలుపెట్టి దూసుకు వెళ్తోంది సమంత.

ఆమె పర్సనల్ లైఫ్ లో విడాకుల అంశం పెద్ద వివాదంగా మారినప్పటికీ... ఆమె కెరీర్ పరంగా మాత్రం దూసుకు వెళ్తోంది. ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. దీనికి తగ్గట్టుగానే బాలీవుడ్, ఇటు దక్షిణ భారత దేశంలో చాన్సులు విపరీతంగా వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

లోకేష్ కనకరాజు తన దర్శకత్వంలో సమంతతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తన ముందు ఉన్న ప్రాజెక్టులు ఫినిష్ చేసి.. సమంతతో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు పెద్ద స్కెచ్ వేశారట. దీనికోసం ఇప్పటి నుంచే సమంత డేట్స్.. ఫైనల్ చేసుకుంటున్నారట లోకేష్ కనకరాజు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story