- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Samantha marriage: సమంత పెళ్లిలో శోభిత ధూళిపాళ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల అక్కినేని నాగచైతన్య మధ్య వచ్చిన రూమర్స్‌ను నిజం చేస్తూ ఆగస్ట్ 8వ తేదీన ఉదయం వీరిద్దరు నిరాడంబరంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చై శోభిత పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి హ్యాపియెస్ట్ మూమెంట్‌లో చైతన్య ఫస్ట్ మ్యారేజ్‌కు సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.
అదేంటంటే.. సమంత పెళ్లిలో శోభిత సందడి చేసిందనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. అంతే కాదు.. ఆ ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అసలు సమంత పెళ్లిలో శోభిత ఏంటీ అని ఆశ్చర్యపోకండి. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదేంటంటే? ఇక్కడ సమంత అంటే మనం అనుకుంటున్న స్టార్ హీరోయిన్ సమంత అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఈమె శోభిత ధూళిపాళ్ల సోదరి సమంత. తన సోదరి ఢిల్లీకి చెందిన ఫిజిషియన్ సాహిల్ గుప్తాను వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్లికి సంబంధిచిన ఫొటోలను శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే వాస్తవంగా నాగచైతన్య మొదటి భార్య పేరు కూడా సమంత కావడంతో ఈ వార్త, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
దీంతో శుభమా అంటూ నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకుంటుంటే.. ఆమె సిస్టర్ సమంత పెళ్లి ఫొటోలు, ఆ వార్తను తెరపైకి తెచ్చి నాగచైతన్య మొదటి భార్య సమంతను గుర్తు చేస్తారు ఏంటీ అని.. మనస్పర్థలు రావడంతో కలిసి జీవించలేమని డిసైడ్ అయ్యి ఎవరికి వాళ్లు హ్యాపీగా జీవిస్తుంటే మళ్లీ సమంత పేరును అడ్డుపెట్టుకుని శోభిత పెళ్లి ఫొటోలు వైరల్ చేయడం ఏంటని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.