సమంత దొంగ ఏడుపులు ఏడ్చి నాగచైతన్యను వదిలించుకుంది.. దుమారం రేపుతున్న జ్యోతిష్యుడి కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-07 05:48:48  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో సమంత(Samantha), అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

సమంత దొంగ ఏడుపులు ఏడ్చి నాగచైతన్యను వదిలించుకుంది.. దుమారం రేపుతున్న జ్యోతిష్యుడి కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో సమంత(Samantha), అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఏమాయ చేసావే’ మూవీతో ప్రేమలో పడ్డ వీరిద్దరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. కొద్ది కాలానికే ఏవో కారణాలతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక డైవర్స్ తర్వాత నాగచైతన్య మాత్రం యంగ్ హీరోయిన్ శోభిత(Sobhita Dhulipala)తో కొన్నేళ్లు డేటింగ్ చేసి గత ఏడాది రెండో పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం మయోసైటీస్‌తో బాధపడింది. ఈక్రమంలోనే పలు మూవీ ఈవెంట్స్‌లో పాల్గొని కన్నీరు పెట్టుకుని సింపతీ కొట్టేసింది. దీంతో నాగచైతన్యపై పలు విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, వీరి విడాకులపై ప్రముఖ సైకాలజిస్ట్ ఎస్. వి నాగనాథ్ ఓ ఇంటర్వూలో పాల్గొని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

ఇన్నేళ్లకు మరోసారి సమంత-నాగచైతన్యలపై పలు వ్యాఖ్యలు చేయడంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. ‘‘సమంత విడాకులు తీసుకున్న తర్వాత సింపతీ కొట్టేయడానికి పలు ఈవెంట్స్‌లో ఏడ్చింది. దొంగ ఏడుపులు ఏడ్చి నాగచైతన్యను వదిలించుకుంది. ఆయన తర్వాత చాలా బాధపడి ఉంటారు. నన్ను సమంత అభిమానులు తిట్టుకున్నా సరే కానీ ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. నాగచైతన్య ఆమెకంటే 100 శాతం బెటర్. చైతు గతంలో పెళ్లికి ఒప్పుకోకపోతే అతన్ని బెదిరించింది. పెళ్లి చేసుకుని మరీ విడాకులు తీసుకుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఆయనను తిడుతున్నారు.

Next Story