ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ షాక్ ఇచ్చిన ‘సలార్’ టీం

by Disha Web Desk 9 |
ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ షాక్ ఇచ్చిన ‘సలార్’ టీం
X

దిశ, సినిమా: ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 28న విడుదల చేయాలని యూనిట్ భావించినప్పటికి అది కుదరలేదు. ఇక ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్ అని అనౌన్స్ అన్నారు. అంటే దీనిని బట్టి లెక్కేసుకుంటే విడుదలకు ఇంక 50 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా ఇప్పటివరకూ ఇంకా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు మేకర్స్. ఈ క్రమంలో ‘సలార్’ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేల కనుక దీపావళికి ఈ మూవీ నుంచి అప్డేట్ రానిపక్షంలో ‘సలార్’ డిసెంబర్‌కు రానట్లే అని చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తుంది. అలాగే ఇటీవల ప్రభాస్ లేకుండా ఇతర నటులతో 10 రోజుల షూటింగ్ చేశారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు కాలేదు. ఇవి ఫినిష్ అయితేనే విడుదల చేయగలరు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ సంతృప్తికరంగా ఉండాలట. వీటన్నిటిని దృష్టిలోకి తీసుకుంటే కనుక ‘సలార్’ డిసెంబర్‌కు రానట్టె. దీంతో ఇక 2024 మార్చ్‌లో విడుదల అనే టాక్ వినపడుతుంది.

Next Story

Most Viewed