- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రాజకీయాల్లోకి ఎంట్రీపై Sai Dharam Tej సంచలన వ్యాఖ్యలు.. జోష్‌లో మెగా ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్, సాయితేజ్ కాంబోలో వస్తున్న సినిమా ‘బ్రో’. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో సాయితేజ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసింది. పూజలు ముగించుకున్న అనంతరం సాయి తేజ్ మీడియాతో మాట్లాడారు..
ఈ సందర్భంగా మీడియా వాళ్లు సాయితేజ్‌ను మీరు జనసేనా తరఫున ప్రచారం చేస్తారా అని ప్రశ్నించగా.. ‘‘అవగాహన లేకుండా పాలిటిక్స్‌లోకి రావద్దని మామయ్య పవన్ కల్యాణ్ చెప్పారు. నాకు సినిమా తప్పితే.. పాలిటిక్స్ గురించి అంతగా తెలియదు. కానీ నా సపోర్ట్ మాత్రం మా మామయ్యకే ఉంటుంది. ఇక మా మామయ్యతో కలిసి సినిమా చేసిన అనుభవం మాటల్లో చెప్పలేను’’ అంటూ సాయితేజ్ చెప్పుకొచ్చారు.