ఐటెం సాంగ్‌తో స్టేజ్‌ను దద్దరిల్లేలా చేసిన సాయి పల్లవి (వీడియో).. సోషల్ మీడియా షేక్!

by Dishafeatures1 |
ఐటెం సాంగ్‌తో స్టేజ్‌ను దద్దరిల్లేలా చేసిన సాయి పల్లవి (వీడియో).. సోషల్ మీడియా షేక్!
X

దిశ,సినిమా:నేచురల్ బ్యూటీ సాయిపల్లవి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె డ్యాన్సులే. ఆమె డాన్స్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో అతియోశక్తి లేదు. ఎందుకంటే స్వతహాగా డ్యాన్సర్ అయిన ఆమె.. ఊహించని విధంగా హీరోయిన్ అయ్యింది. 2015లో మలయాళం మూవీ ‘ప్రేమమ్’ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలాగే 2017లో ‘ఫిదా’ మూవీ తో తెలుగు ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. తెలుగులో కొన్ని సినిమాలే చేసినప్పటికీ చాలా గుర్తింపు సంపాదించింది. ఆమెతో పోటీపడి డాన్స్ చేయాలంటే కష్టమని హీరోలు అనుకుంటారు.

అయితే ఇప్పుడు తాజాగా సాయిపల్లవికి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.స్నేహితులతో కలిసి ‘షీలా కీ జవానీ సాంగ్’ కు( Sheela ki Jawani Song ) సాయిపల్లవి ఊర మాస్ డాన్స్ చేయగా ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎలాంటి కఠినమైన స్టెప్ అయినా అలవోకగా చేసే సాయిపల్లవి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి ‘రామాయణం’ ప్రాజెక్ట్ లో సీత గా నటిస్తున్నారు. రామాయణం ప్రాజెక్ట్ కు సాయిపల్లవి భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టులన్నీ క్రేజీ ప్రాజెక్ట్ లు కావడంతో రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ కెరీర్ పరంగా మరింత ఎదగడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed