పెళ్లి చేసుకోబోతున్న సాయి ధరమ్ తేజ్.. వధువు ఎవరో కాదు ఆ హీరోయినే..?

by Disha Web Desk 7 |
పెళ్లి చేసుకోబోతున్న సాయి ధరమ్ తేజ్.. వధువు ఎవరో కాదు ఆ హీరోయినే..?
X

దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. తన యాక్టింగ్‌తో, మంచి వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. గతంలో జరిగిగ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తేజ్.. ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా.. టోటల్‌గా కమ్ బ్యాక్ అయ్యాడు. ఇక గత ఏడాది సత్య అనే ఫీచర్ ఫీల్మ్‌ను రిలీజ్ చేసి అందులో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రస్తుతం ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అయితే.. తేజ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అతనికి చాలా మంది హీరోయిన్లతో లవ్ ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత అవన్ని ఫుకార్లే అని తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన హీరోయిన్‌గా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా సాయి ధరమ్ తేజ్, రెజీనా పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో వరుణ్, లావణ్య లాగా లాస్ట్ ట్విస్ట్ ఇచ్చి పెళ్లి చేసుకుంటారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


Next Story