Oscars 2023: RRR సహా పోటీలో 9 దేశీయ చిత్రాలు

by Disha Web Desk 2 |
Oscars 2023: RRR సహా పోటీలో 9 దేశీయ చిత్రాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆస్కార్‌ పురస్కారం కోసం నామినేషన్స్‌ బరిలో నిలిచిన సినిమాల తాజా జాబితాను ఆస్కార్ వెల్లడించింది. 'ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌' మంగళవారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 301 సినిమాలు చోటుదక్కించుకున్నాయి. ఈ ఆస్కార్ రేసులో 10 భారతీయ చిత్రాలు పోటీలో నిలిచాయి. మరోవైపు, చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ను దున్నేసిన కన్నడ చిత్రం 'కాంతార' ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఇక ఈ జాబితాలో.. వివేక్‌ అగ్నిహోత్రి డైరెక్షన్లో తెరకెక్కిన ది కాశ్మీర్‌ ఫైల్స్‌, ఆలియాభట్ లేడీ ఓరియెంటేడ్ మూవీ గంగూబాయ్ కథియావాడా, ఆర్ఆర్ఆర్, కాంతారా, రాకెట్రీ, ఇరవిన్‌ నిఝాల్, విక్రాంత్‌ రోనా, ఛెల్లో షో, మీ వసంతరావ్, తుజ్యా సతీ కహీ హై, మూవీలు ఆస్కార్‌ జాబితాలో ఎంట్రీ ఇచ్చాయి. డాక్యుమెంటరీ విభాగంలో ఆల్‌ దట్‌ బ్రితెస్‌, ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ ఎంట్రీ సాధించాయి. ఆస్కార్‌లో షార్ట్‌ లిస్టైన 4 విభాగాల్లో ఛెల్లో షో, ఆర్​ఆర్​ఆర్​, ఆల్‌ దట్‌ బ్రితెస్‌, ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ చోటు దక్కించుకున్నాయి. ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ పది విభాగాల షార్ట్‌ లిస్ట్‌లను డిసెంబర్‌లో ప్రకటించింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఛెల్లో షో, తెలుగు బ్లాక్‌బస్టర్‌ మూవీ ఆర్ఆ​ర్‌ఆర్​లోని నాటునాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఎంట్రీ సాధించింది. ఆల్‌ దట్‌ బ్రితెస్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌గా, ద ఎలిఫెంట్‌ విష్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్‌ కేటగిరీలో ఎంట్రీ పొందాయి. నామినేషన్లకు ముందు 3 ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ల్లో భారత్‌ చేరటం ఇదే మొదటిసారి. ఈనెల 24న 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన చిత్రాలను ప్రకటించనుండగా...మార్చి 12న ఆస్కార్‌ వేడుక జరగనుంది.

ఇవి కూడా చదవండి : రిమైండర్ లిస్ట్ ప్రకటించిన ఆస్కార్ అకాడమీ.. భారత్ నుంచి 4 సినిమాలు చోటు

Next Story

Most Viewed