CM రేవంత్ రెడ్డికి సీపీఐ నారాయణ స్వీట్ వార్నింగ్

by Disha Web Desk 4 |
CM రేవంత్ రెడ్డికి సీపీఐ నారాయణ స్వీట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నారాయణ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఓ ఛానెల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ కేసీఆర్‌ను విమర్శించినట్లు రేవంత్ రెడ్డి కేరళకి వెళ్లి పినరయి విజయన్ గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. పినరయి విజయన్‌పై రేవంత్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైందేనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చుట్టే బోలెడు కేసులున్నాయని.. లెఫ్ట్‌ను విమర్శించేటప్పుడు రాజకీయాలు మాట్లాడాలని పర్సన్ జోలికి పోవద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులు, పోటీ పెట్టుకుంటున్నామని నారాయణ క్లారిటీ ఇచ్చారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌తో సీట్లు సర్దుబాటు కుదరని చోట విడిగా పోటీ చేస్తున్నామన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులమే కానీ ఇండియా కూటమిలో మిత్రులం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్దతుపై నారాయణ స్పందిస్తూ.. సీపీఎం పోటీ చేసే స్థానాల్లో తొలుత మద్దతు ఇస్తామని తర్వాతే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణలో పోటీ చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని నారాయణ అన్నారు. కాంగ్రెస్‌ను సీట్లు అడిగినా ఇవ్వలేదని.. అయితే తాము బీఆర్ఎస్, బీజేపీకి మద్దతివ్వలేం అని స్పష్టం చేశారు. మోడీ, ఎంఐఎంలది జిగిరి దోస్తానా అని.. అందుకే ఎన్నో అరచకాలకు పాల్పడే ఎంఐఎం నేతలపై ఒక్క కేసు లేదన్నారు. ఓల్డ్ సిటీలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయవన్నారు.

Next Story

Most Viewed