- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి రాబోతున్న రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘విత్ లవ్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

దిశ, సినిమా: దర్శకుడిగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అభిషన్(Abhishan Jeevinth), ఇప్పుడు హీరోగా మారి ‘విత్ లవ్’(with love) చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించగా, మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించి మెప్పించింది. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, యువతతో పాటు సినీ సెలబ్రిటీలను సైతం మంత్రముగ్ధులను చేసి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
ఆమె నిర్మాణ విలువలు, దర్శకుడు మదన్ టేకింగ్ తోడై ఈ సినిమాను ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి. కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకోవడంతో ఈ సినిమా ఈ ఏడాది చిన్న చిత్రాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. అభిషన్ నటన, అనస్వరతో ఆయన కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘విత్ లవ్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 6వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, ఇప్పుడు ఓటీటీ వేదికగా ఈ అందమైన ప్రేమకథను వీక్షించవచ్చు.






