Ravi Teja కోసం రంగంలోకి Renu Desa.. స్పెషల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2023-10-10 16:06:56  IST  )

టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్ 'బద్రి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది..Latest Telugu News

Ravi Teja కోసం రంగంలోకి Renu Desa.. స్పెషల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్ 'బద్రి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అంతేకాకుండా కొన్ని చిత్రాల్లో కూడా నటించింది మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా, రేణు దేశాయ్ ఓ స్పెషల్ పోస్టుతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, వంశీ కృష్ణ కాంబినేషన్‌ లో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కున్న మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. ఇందులో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో రేణు దేశాయ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తునట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ''ఈ చిత్రంలో నేను భాగమైనందుకు, హేమలత లవణం గారి లాంటి స్పూర్తిదాయకమైన పాత్రలో నేను చేయగలను అని నమ్మినందుకు దర్శకుడు వంశీ కృష్ణకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు'' అంటూ రాసుకొచ్చింది. హేమలత లవణం.. టైగర్ నాగేశ్వరరావు అక్క.. ఆమె పాత్రతోనే రేణు దేశాయ్ అలరించనుంది.

Next Story