సమ్మర్ కానుకగా రాబోతున్న రవిబాబు యాక్షన్ థ్రిల్లర్ ‘రేజర్’.. హైప్ పెంచుతున్న వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-10 09:05:50  IST  )

టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు (Ravi Babu)మరోసారి తనదైన శైలిలో వెండితెరపై సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

సమ్మర్ కానుకగా రాబోతున్న రవిబాబు యాక్షన్ థ్రిల్లర్ ‘రేజర్’.. హైప్ పెంచుతున్న వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు (Ravi Babu)మరోసారి తనదైన శైలిలో వెండితెరపై సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. నటుడిగా, దర్శకుడిగా విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఈసారి రూట్ మార్చి ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. బ్రూటల్ కంటెంట్‌తో స్లాషర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రేజర్’ (Razor)అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. న్యాయం అనేది చాలా పచ్చిగా, క్రూరంగా ఉంటుందనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రవిబాబు రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక వీడియో ద్వారా కీలక అప్‌డేట్ ఇచ్చింది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ మే 2026లో ‘రేజర్’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. రవిబాబు స్వయంగా దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో కనిపిస్తుండటంతో, ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రవిబాబు గతంలో ‘అవును’, ‘నచ్చావులే’ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ‘రేజర్’తో మరింత క్రూరమైన, పవర్‌ఫుల్ కథను చెప్పబోతున్నట్లు టీజర్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. యాక్షన్ ప్రియులను, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో రవిబాబు తన ‘రేజర్’తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి గర్జన చేస్తారో చూడాలి.


Next Story