- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త రంగంలోకి రవితేజ.. ఆ సినిమాతో ART మాల్ ప్రారంభం.. టాలీవుడ్ హీరో దశ మారనుందా?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోలు ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కొందరు నిర్మాతలుగా, దర్శకులుగా కూడా మారుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు ఎక్కువగా.. థియేటర్ బిజినెస్‌లో సక్సెస్ అవుతుండటంతో కొత్త వాల్లు యాడ్ అవుతున్నారు. ఇప్పటికే ఈ రంగంలో కొంతమంది రాణిస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా, స్టార్ హీరోల లిస్ట్‌లోకి మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)చేరాడు. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని వనస్థలిపూరంలో ఆరు స్క్రీన్‌లతో కూడిన లగ్జరీ మల్టీఫ్లెక్స్‌ను ARTపేరుతో ప్రారంభించనున్నారు. అది కూడా ‘కింగ్‌డమ్’ (Kingdom)విడుదల నాడే ఓపెనింగ్ కాబోతుండటం విశేషం. ఇక ఈ థియేటర్‌లో మొదట ఏ సినిమాను ప్రదర్శించనున్నారనే దానిపై నెట్టింట పలు చర్చలు మొదలయ్యాయి.
ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మాల్‌లో మొట్టమొదటగా.. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘కింగ్‌డమ్’ చిత్రాన్నే ప్రదర్శించబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇక ఇందులో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. వీపి వెంకటేష్ విలన్ పాత్రలో నటించగా.. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. భారీ అంచనాల మధ్య రాబోతోంది. అయితే రవితేజ మాల్‌లో విజయ్ చిత్రం ప్రదర్శించడంపై కొంతమంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఫ్లాప్స్ అందుకుంటున్న విజయ్‌కి ఈ సినిమా అయినా కలిసొస్తుందా? లేదా అని అంటున్నారు. అలాగే రవితేజ మాల్ ఈ మూవీ తర్వాత నష్టాల పాలవుతుందేమో? అని చర్చించుకుంటున్నారు.






