అనుకున్న టైమ్‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రావణాసుర’

by Disha Web Desk 13 |
అనుకున్న టైమ్‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రావణాసుర’
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న మూవీ ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించిన హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ తాజాగా పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో చిత్రీకరించిన పాటతో అనుకున్న సమయానికి కంప్లీట్ చేసినట్లు తెలిపారు.

ఇదిలావుంటే.. ఏప్రిల్ 7న విడుదల కానున్న సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ రవితేజ పాత్రని విభిన్న షేడ్స్‌లో చూపించగా, రెండవ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సుశాంత్ కీలకపాత్ర పోషించిన చిత్రంలో అను ఇమ్మాన్యుయల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటించగా హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Next Story

Most Viewed