‘రావణాసుర’ సినిమాపై భారీ అంచనాలు

by Disha Web Desk 7 |
‘రావణాసుర’ సినిమాపై భారీ అంచనాలు
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుండగా.. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో.. రవితేజ చేతిలో తుపాకీతో ఇంటెన్స్‌ లుక్‌తో కనిపించారు.

బ్యాక్‌గ్రౌండ్‌లో న్యాయ దేవత, కోర్టు గది తగలబడిపోవడం చూస్తుంటే మూవీ టోటల్ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఉండేలా ఉందంటున్నారు విశ్లేషకులు. కాగా మూడు రోజుల్లో రాబోయే ‘రావణాసుర’ ట్రైలర్‌లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఉంటాయని తెలుస్తోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ కాగా హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.



Next Story