సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ‘రావణాసుర’

by Disha Web Desk 6 |
సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ‘రావణాసుర’
X

దిశ, సినిమా : ‘సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురున్ని దాటెళ్లాలి’ అంటున్న రవితేజ విలనిజం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. తాజాగా విడుదలైన ‘రావణాసుర’ టీజర్.. థ్రిల్లర్స్‌కే థ్రిల్ ఇచ్చేట్లుగా ఉండగా.. ‘నిజం అనేది ఫిక్షన్ కంటే దారుణంగా ఉంటుంది’ అనే కోట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘హీరోలు లేరు’ అనే ట్యాగ్‌లైన్ రవితేజ మంచివాడా? చెడ్డవాడా? అనే క్యూరియాసిటీని కలిగిస్తుండగా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ స్టైలిష్ అండ్ గ్రిప్పింగ్‌గా ఉంది. సుశాంత్ కీలకపాత్రలో కనిపించనున్న సినిమాను.. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించగా.. ఏప్రిల్ 7న విడుదల కానుంది.

Next Story

Most Viewed