Rashmika Mandanna: ఈ కీలక నిర్ణయం అనుకోకుండా తీసుకున్నదంటూ రష్మిక షాకింగ్ పోస్ట్.. దేని గురించంటే?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

Rashmika Mandanna: ఈ కీలక నిర్ణయం అనుకోకుండా తీసుకున్నదంటూ రష్మిక షాకింగ్ పోస్ట్.. దేని గురించంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. గత రెండు రోజు క్రితం ఆమె ప్రియుడు విజయ్ దేవరకొండతో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై వీరిద్దరు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే.. తాజాగా, రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అందులో ఏముందంటే.. ‘‘మేము దాదాపు 12 రోజుల పాటు ‘థామా’ (Thamma)షూట్ ఓ అద్భుతమైన ప్రదేశంలో చేశాం.

ఆ చివరి రోజున మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. అదే ప్లేస్‌లో పాట ఎందుకు షూట్ చేయకూడదు అని అనుకున్నారు. అందరికీ ఆలోచన నచ్చడంతో పాటు లోకేషన్ కూడా నచ్చింది. దీంతో 3-4 రోజుల పాటు మేము రిహార్సల్స్ చేసి పాటను షూట్ చేశాం. పాట అయ్యాక చూసి అందరం ఆశ్చర్యపోయాం. ఈ నిర్ణయం అనుకోకుండా తీసుకున్నది. ప్లాన్ చేసిన వాటికంటే.. ఇది బాగా వచ్చిందనిపించింది. ఈ పాటలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పాట మీ కృషి వల్లే సాధ్యమైంది..

మీరంతా కూడా ఈ పాటను థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ప్రస్తుతం రష్మిక ‘థామా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana), ఆదిత్య సర్పోత్దార్ కాంబోలో రాబోతున్న హారర్ మూవీ. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story