చరిత్ర సృష్టించిన స్టార్ హీరో సినిమా.. వేయి కోట్లు కొల్లగొట్టి రికార్డు బద్దలు కొట్టిందిగా..

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’(Dhurandhar) భాక్సాఫీసును షేక్ చేస్తోంది.

చరిత్ర సృష్టించిన స్టార్ హీరో సినిమా.. వేయి కోట్లు కొల్లగొట్టి రికార్డు బద్దలు కొట్టిందిగా..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’(Dhurandhar) భాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తోన్న ఈ చిత్రం అరుదైన ఘనత సాధించడంతో పాటు రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పటివరకు వరల్డ్‌ వైడ్‌గా రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అంతేకాకుండా ‘ధురంధర్’ 2025లో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రికార్డు ఇంతకుముందు ‘యానిమల్‌’కు ఉండగా.. దానిని బ్రేక్ చేసి ‘ధురంధర్’ ఏ రేటింగ్ సినిమాగా ఘనత సాధించింది. తొలిరోజు నుంచే అత్యధిక కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతున్న ‘ధురంధర్’ డిసెంబర్ 25న రూ. 26 కోట్లు రాబట్టడంతో రూ. 1000 కోట్ల బరిలో నిలిచింది. దీంతో ఇప్పటివరకు పలు బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డులను ‘ధురంధర్’ బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్త్రీ-2, ఛావాను బీట్ చూసి టాప్‌ వన్‌లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గర్వంగా ఉన్న మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో నెటిజన్లు టీమ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఆదిత్య ధర్(Aditya Dhar) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడం విశేషం.

link

Next Story