Chandrayaan-3 గురించి మినిమమ్ నాలెడ్జ్ లేని హీరో.. అడిగితే తెల్లమొఖం వేశాడు..

by Disha Web Desk 7 |
Chandrayaan-3 గురించి మినిమమ్ నాలెడ్జ్ లేని హీరో.. అడిగితే తెల్లమొఖం వేశాడు..
X

దిశ, సినిమా : చంద్రయాన్ - 3 సక్సెస్‌ కావడంతో యావత్ భారతదేశం సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులంతా.. ఇస్రో సైంటిస్టులపై ప్రశంసలు కురిపిస్తూ నెట్టింట పోస్టులు పెట్టారు. అయితే ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చిన రణ్‌వీర్ సింగ్‌ను ఈ విషయం గురించి మాట్లాడాలని కోరారు పాపరాజీస్. కానీ దీనిపై కనీసం రియాక్ట్ కాకుండానే వెళ్లిపోయాడు హీరో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ‘ఇలాంటి వారిని హీరోలుగా ట్రీట్ చేస్తూ అవసరంగా హైప్ ఇస్తున్నాం’ అని తిట్టిపోస్తున్నారు. ‘నిజంగా సిగ్గు అనిపిస్తుంది. వీళ్లను మనం హీరోలుగా కన్సిడర్ చేస్తాం. కానీ మన రియల్ హీరోస్ సైంటిస్టులు’ అని ఇంకొందరు కామెంట్ చేశారు.

Next Story