ఫుల్ యాక్షన్ మోడ్‌లో రణ్‌వీర్ సింగ్.. ఒళ్ళు జలదరించేలా ‘ధురంధర’ ట్రైలర్

by Mallepaka Hamsa |

కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు రణ్‌వీర్ సింగ్(Ranveer Singh).

ఫుల్ యాక్షన్ మోడ్‌లో రణ్‌వీర్ సింగ్.. ఒళ్ళు జలదరించేలా ‘ధురంధర’ ట్రైలర్
X

దిశ, సినిమా: కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు రణ్‌వీర్ సింగ్(Ranveer Singh). కానీ ఇప్పటివరకు అంతగా హిట్స్ అందుకున్నది లేదు. గత కొద్ది కాలంగా డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న ఆయన హిట్, ఫ్లాప్ అనుకోకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ‘ధురంధర’(Dhurandhara) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి ఆదిత్య ధర్ (Aditya Dhar)దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా సారా అర్జున్ హీరోయిన్‌గా నటిస్తోంది.

భారత్ vs పాక్ ఉగ్రవారం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుండగా.. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ ట్రైలర్‌తో గూస్ బంప్స్ తెప్పించారు. 4 నిమిషాలకు పైగానే ఉన్న ఈ ట్రైలర్ పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో ఒళ్ళు జలదరించేలా ఉంది. ముందుగానే ఓ వ్యక్తికి ఒంటినిండా చువ్వలు కుచ్చి రక్తం కారుతున్న దృశ్యాలు చూపించి భయపెట్టేశారు. అతను అల్లాడి పోతున్నప్పటికీ కనికరించకుండా.. అలాగే ఉంచేస్తారు.ఆ తర్వాత హీరో గడ్డం గుబురుగా ఉన్న జుట్టుతో ఎంట్రీ ఇస్తాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ కెమిస్ట్రీ అదిరిపోయింది.

Next Story