భారీ ఆఫర్ కొట్టేసిన Sreeleela.. ఆ స్టార్ హీరోయిన్ పక్కన పెట్టి మరీ Ram charan సినిమాలో ఛాన్స్..!

by Anjali |
భారీ ఆఫర్ కొట్టేసిన Sreeleela.. ఆ స్టార్ హీరోయిన్ పక్కన పెట్టి మరీ Ram charan సినిమాలో ఛాన్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ఈ బ్యూటీ అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దీంతో దర్శక, నిర్మాతలు ఈ హీరోయిన్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఈమె ఖాతాలో పది చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రంలో మొన్నటి వరకు బాలీవుడ్ హీరోయిన్ ‘జాన్వీ కపూర్’ను తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. మళ్లీ ఏమైందో తెలియదు కానీ ఆమె ప్లేస్‌లో శ్రీలీలను తీసుకున్నారట మేకర్స్. అంతేకాదు చరణ్ కూడా ఈ మూవీలో శ్రీలీల నేమ్‌ను సజెస్ట్ చేసినట్లు మూవీ సర్కిల్స్‌లో టాక్. పాన్ ఇండియా స్టార్ హీరోనే ఈ అమ్మడుపై కన్నేశాడంటే.. శ్రీలీల రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ’’ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Read more : ఎవ్వరికి చూపించని ప్లేస్‌లో టాటూ.. ఛీ నువ్వు కూడానా జాను అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Next Story

Most Viewed