పెద్ది సినిమాకు కొత్త చిక్కులు...ఆందోళ‌న‌లో చ‌ర‌ణ్ ఫ్యాన్స్ !

by velandi.Saikiran |

పెద్ది రామ్ చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ట‌. గేమ్ ఛేంజ‌ర్ లాంటి బ‌డా సినిమాలో కూడా చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్ చేశారు.

పెద్ది సినిమాకు కొత్త చిక్కులు...ఆందోళ‌న‌లో చ‌ర‌ణ్ ఫ్యాన్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: రామ్ చ‌ర‌ణ్ గురించి తెలియ‌ని వారుండ‌రు. మెగాస్టార్‌ చిరంజీవి వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని.. ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చ‌ర‌ణ్‌.. ఇప్పుడు త‌న కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. అలాంటి రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం.. పెద్ది సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గేమ్ ఛేంజ‌ర్ లాంటి సినిమా చేసిన త‌ర్వాత‌.. బుచ్చిబాబుతో ఈ సినిమా చేస్తున్నారు చ‌ర‌ణ్‌.

ఈ పెద్ది సినిమాకు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా... జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా మెరువ‌నున్నారు. జ‌గ‌ప‌తి బాబు, శివ రాజ్ కుమార్ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు బుచ్చిబాబు. అయితే... ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ట‌. దీంతో చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

ఎందుకంటే.. గేమ్ ఛేంజ‌ర్ లాంటి బ‌డా సినిమాలో కూడా రామ్‌ చ‌ర‌ణ్ డ్యూయ‌ల్ రోల్ చేశారు. కానీ వ‌ర్కౌట్ కాలేదు. సినిమాపై దారుణంగా ట్రోలింగ్స్ కూడా వ‌చ్చాయి. ఇలాంటి త‌రుణంలోనే..మ‌రోసారి డ్యూయ‌ల్ రోల్ సినిమానే చేస్తున్నారు చ‌ర‌ణ్‌. దీంతో మెగా అభిమానులు భ‌య‌ప‌డిపోతున్నారు. సినిమా హిట్ అవుతుందో ? లేదో ? అని టెన్ష‌న్ ప‌డుతున్నారు. గేమ్ ఛేంజ‌ర్ లాగా పెద్ది కూడా ఫ్లాఫ్ అయితే.. క‌ష్ట‌మేనంటున్నారు.

Next Story