''పుష్ప''కు గట్టి పోటీ ఇస్తున్న ''రామ్ అసుర్'' చిత్రం

by Web Desk |
పుష్పకు గట్టి పోటీ ఇస్తున్న రామ్ అసుర్ చిత్రం
X

దిశ, వెబ్‌డెస్క్: కంటెంట్ ఉన్న సినిమాలకు టాలివుడ్‌లో మంచి రెస్పాన్స్ దక్కుతుంది. స్టోరీ ఏ మాత్రం నచ్చిన ప్రేక్షకులు ఆ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తుంటారు తెలుగు ప్రజలు. అయితే అది చిన్న, పెద్ద సినిమా అనే తేడా ఏమీ ఉండదు. దీనికి నిదర్శనమే ''రామ్ అసుర్'' చిత్రం. ఓటీటీ ప్లాట్‌ఫమ్‌లో సంక్రాంతి బరిలోకి దిగింది ఈ చిత్రం. అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్, చాందినీ, షానీ, సాల్మాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుండటంతో ప్రస్తుతం అమేజాన్‌లో టాప్ 2 పోజిషన్‌లో కోనసాగుతుంది. మొదటి స్థానంలో ''పుష్ప'' సినిమా ఉండటం విశేషం.

తెలుగు మూవీస్ క్యాటగిరీలోనూ, యాక్షన్ అడ్వెంచర్ క్యాటగిరీలోనూ రామ్ అసుర్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఆర్టిఫీషియల్ డైమండ్ ను రూపోందించాలనుకున్న ఇద్దరి సైంటిస్టుల జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అన్నదే ఈ సినిమా స్టోరీ. వెంకటేష్ త్రిపర్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. అభినవ్ సర్దార్ సొంతంగా సినిమాను నిర్మించారు. అయితే అమేజాన్ ప్లాట్ ఫామ్‌లో పష్పతో పోటీపడుతున్న ''రామ్ అసుర్'' ఇదే ఊపులో టాప్ ప్లేస్‌కు చేరుకున్న అశ్చర్యం లేదంటున్నారు ప్రేక్షకులు.

Next Story