ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టమే : Rakul Preet Singh

by Chukka Sudharani |   (  Updated:2023-01-20 12:57:34  IST  )

'భారతీయుడు 2'లో కమల్ హాసన్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా షేర్ చేసుకుంది.

ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టమే : Rakul Preet Singh
X

దిశ, సినిమా : 'భారతీయుడు 2'లో కమల్ హాసన్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా షేర్ చేసుకుంది. జనవరి 20న విడుదలైన తన నయా మూవీ 'ఛత్రీవాలీ' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆమె.. ఈ క్రమంలోనే అప్ కమింగ్ మూవీ గురించి మాట్లాడింది. ఈ మేరకు లెజెండరీ నటుడితో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తానంది. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో 60 ఏళ్లు పనిచేసిన కమల్.. ఒక సంస్థ లాంటి సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పింది.

అలాగే విజయానికి షార్ట్‌కట్‌ లేదని ఆయన కెరీర్ చూస్తే అర్థమవుతుందన్న ఆమె.. తన అనుభవం కొత్త తరానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొంది. ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే పని పట్ల అభిరుచి, అంకితభావం అవసరమని అభిప్రాయపడింది. 1996లో వచ్చిన బ్లాక్‌ బస్టర్ ఫిల్మ్ 'భారతీయుడు'కు ఈ చిత్రం సీక్వెల్ కాగా ఇందులో రకుల్‌తోపాటు కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి : ఆ రోజు సల్మాన్ వచ్చేదాకా ఆకలితో అల్లాడిపోయాం: 'రెడీ' షూటింగ్‌పై కుబ్రా


Next Story