- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
33ఏళ్ల తర్వాత నా గుండె ఆనందంతో కొట్టుకుంటోంది.. రజనీ ఎమోషనల్ పోస్ట్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన అప్ కమింగ్ మూవీ ‘#Thalaivar 170’కి సంబంధించి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ తన అప్ కమింగ్ మూవీ ‘#Thalaivar 170’కి సంబంధించి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘జైభీమ్’ డైరెక్టర్ T.J జ్ఞానవేల్ తెరకెక్కించబోతున్న ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ చేసుకోగా తదుపరి చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండగా తాజాగా ఆయన షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా బిగ్‌బీతో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేశాడు రజనీకాంత్. ‘33 ఏళ్ల తర్వాత.. నా గురువు అమితాబ్ బచ్చన్‌తో #Thalaivar 170కోసం మళ్లీ కలిసి పనిచేస్తున్నా. నా గుండె ఆనందంతో కొట్టుకుంటోంది’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Next Story






