నా అనుమతి లేకుండా పేరు, ఫొటోలు వాడకూడదు: Rajinikanth issues public notice

by Prasanna |
నా అనుమతి లేకుండా పేరు, ఫొటోలు వాడకూడదు: Rajinikanth issues public notice
X

దిశ, సినిమా: ఎలాంటి బ్యాక్‌‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి సామాన్యుడిగా వచ్చి సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రజినీకాంత్. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి పేరును కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా తమ వస్తువు ప్రజలకు చేరడం కోసం ప్రకటనలకు వినియోగిస్తున్నారు. ఇక ఈ విషయంపై సీరియస్ అయిన సూపర్ స్టార్ రజనీ కాంత్ తరపు లాయర్ సుబ్బయ్య స్పందించారు. సుబ్బయ్య మాట్లాడుతూ.. 'దశాబ్దాలుగా సూపర్ స్టార్ రజినీకాంత్ పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి, ప్రేక్షకులలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తి పరువు ప్రతిష్ట, వ్యక్తిత్వానికి ఏదైనా నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తాజాగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లతో పాటు కంపెనీలు రజినీకాంత్ పేరు, వాయిస్, ఫొటోలతో పాటు ఇమేజ్‌ని వాడుకుంటునట్లు మాకు తెలిసింది. ఇక నుంచి ఎవరైనా వ్యక్తిగత, వ్యాపార అవసరాలు సహా దేనికైనా ఆయన అనుమతి లేనిదే వినియోగిస్తే నోటీసులు ఇస్తాం' అని వార్నింగ్ ఇచ్చారు.

READ MORE

'Pathaan' నడుస్తున్న థియేటర్లకు భారీ నష్టం.. సీట్లు విరగొడుతున్న అభిమానులు

Next Story