మెక్సికో ఈవెంట్‌లో రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్.. CCXP వేదికపై చారిత్రాత్మక గ్లింప్స్ విడుదల!

by Mallepaka Hamsa |

మెక్సికో సిటీలోని CCXP వేదికపై రేపు జరగబోయే ఈవెంట్‌లో “వారణాసి టు ద వరల్డ్” అనే పేరుతో ఒక ఎక్స్‌క్లూజివ్ వీడియోను ప్రదర్శించబోతున్నట్లు సమాచారం.

మెక్సికో ఈవెంట్‌లో రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్.. CCXP వేదికపై చారిత్రాత్మక గ్లింప్స్ విడుదల!
X

దిశ, సినిమా: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’ ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్ వైపు అడుగులు వేస్తోంది. మెక్సికోలో జరుగుతున్న CCXP 2026 వేదికపై రేపు (ఏప్రిల్ 24) జరగబోయే ఈవెంట్‌తో ఈ సినిమా హంగామా అంతర్జాతీయంగా మొదలుకానుంది. మెక్సికో సిటీలోని CCXP వేదికపై రేపు జరగబోయే ఈవెంట్‌లో “వారణాసి టు ద వరల్డ్” అనే పేరుతో ఒక ఎక్స్‌క్లూజివ్ వీడియోను ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. రాజమౌళి గారు షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల, ఆయన ఒక స్పెషల్ వీడియో మెసేజ్ పంపారు. ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ ఈ కార్యక్రమంలో పాల్గొని గ్లోబల్ ఆడియన్స్‌కు సినిమా గురించి మరిన్ని విశేషాలు వెల్లడించనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా.. ఈ మూవీలో మహేష్ బాబు డ్యూయల్ రోల్‌లో రుద్ర ,రాముడు కనిపించబోతున్నారు.

ప్రియాంక చోప్రా ‘మందానికి’ పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే నెగటివ్ రోల్‌లో కనిపించనున్నారు. సుమారు రూ. 1,400 కోట్ల ($150 Million) భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలవబోతోంది. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. అంతేకాకుండా కెన్యా అడవుల్లో కూడా కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరించారట. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు దీనికి పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న (ఉగాది కానుకగా) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 భాషల్లో, ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో విడుదల కానుంది.

Next Story