- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీక్రెట్‌గా ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చిన రాహుల్ సిప్లీగంజ్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
ఫోక్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్(Rahul Sipligunj) గురించి స్పెషల్ చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోక్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్(Rahul sipligunj) గురించి స్పెషల్ చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో తన పాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. అలాగే బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి వెళ్లి విన్నర్ కూడా అయ్యాడు. ఇక దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) చిత్రంలో ఆయన పాడిన నాటు నాటు(Natu Natu) సాంగ్ ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టింది. దీంతో 2023లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. రాహుల్‌కు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోటి రూపాయల బహుమతిస్తానని కూడా ప్రకటించారు. అన్నట్లుగానే ఇటీవలే రాహుల్‌కు కోటి రూపాయల చెక్‌ను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ సిప్లీగంజ్ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక ఈ కార్యక్రమానికి తన కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ కానీ, అతని కుటుంబ సభ్యులెవరూ కూడా ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి తన ఎంగేజ్‌మెంట్ గురించి రాహుల్ స్పందిస్తాడో లేదో చూడాల్సి ఉంది.






