- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న రాఘవ లారెన్స్ కూతురు.. మొదటి సినిమాతో భారీ రిస్క్!
అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్ని సంవత్సరాల పాటు పని చేసి అనుభవం సంపాదిస్తారు. కానీ రాఘవి మాత్రం ఎలాంటి అసిస్టెంట్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా, నేరుగా డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమైనట్లు టాక్.

దిశ, సినిమా: కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా తనదైన ముద్ర వేసిన రాఘవ లారెన్స్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ కాంచన-4తో పాటు లోకేష్ కనగరాజ్ కథను అందిస్తున్న ‘బెంజ్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. అంతేకాకుండా ఆయన కెరీర్‌లో ప్రతిష్టాత్మక చిత్రంగా రాబోతున్న ‘కాలభైరవ’తో ఫుల్ బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా, రాఘవ లారెన్స్ కుటుంబానికి సంబంధించిన వారు సినిమా రంగంలోకి రాబోతున్నట్లు సమాచారం. అయితే చాలా మంది స్టార్ల పిల్లల్లాగా హీరోయిన్‌గా కాకుండా.. లారెన్స్ కూతురు రాఘవి ఏకంగా దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. రాఘవికి చిన్నప్పటి నుండే సినిమా మేకింగ్ పట్ల చాలా ఆసక్తి ఉండేదట. అందుకోసమే ఆమె అమెరికా వెళ్లి అక్కడ ప్రత్యేకంగా డైరెక్షన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ కోర్సును కూడా పూర్తి చేసిందట.
సాధారణంగా ఎవరైనా దర్శకులు కావాలనుకుంటే పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్ని సంవత్సరాల పాటు పని చేసి అనుభవం సంపాదిస్తారు. కానీ రాఘవి మాత్రం ఎలాంటి అసిస్టెంట్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా, నేరుగా డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమైనట్లు టాక్. అమెరికాలో నేర్చుకున్న టెక్నాలజీ నాలెడ్జ్‌తోనే ఆమె దర్శకురాలిగా భారీ రిస్క్ తీసుకోబోతుందట. కూతురు అడిగిన వెంటనే లారెన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. రాఘవి చేయబోయే మొదటి సినిమాను లారెన్స్ స్వయంగా తన సొంత డబ్బులతో నిర్మించబోతున్నారట. దీనికి సంబంధించిన కథ కూడా ఇప్పటికే రెడీ అయినట్లు తెలుస్తోంది. కాగా.. లారెన్స్ ఇప్పటికే తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్‌ను హీరోగా నిలబెట్టడం కోసం సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తమ్ముడితో పాటు కూతురు కూడా ఇండస్ట్రీలోకి వస్తుండటంతో.. లారెన్స్ ఫ్యామిలీ నుండి వరుసగా కొత్త వాళ్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లయింది.






