Project K's first glimpse : ఫాన్స్కు గుడ్ న్యూస్.. ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్

by Disha Web Desk 7 |
Project Ks first glimpse : ఫాన్స్కు గుడ్ న్యూస్.. ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ‘ప్రాజెక్ట్-కె’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో కమల్ హాసన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మరో ఖతర్నాక్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘ప్రాజెక్ట్-కె’ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను జూలై 20 న అమెరికాలో, జూలై-21 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ఇక ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Next Story

Most Viewed