- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆంధ్ర కింగ్ తాలూకా’టికెట్ రేట్స్‌పై నిర్మాత ట్వీట్.. బాత్ రూంకి పొమ్మంటూ ఎస్‌కేఎన్‌కు నెటిజన్ల కౌంటర్లు
సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి సంచలనం సృష్టిస్తున్నాడు. ఎన్నో కొత్త చిత్రాలను పైరసీ చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ జైలులో ఉంచారు.

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి సంచలనం సృష్టిస్తున్నాడు. ఎన్నో కొత్త చిత్రాలను పైరసీ చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ జైలులో ఉంచారు. ఇక ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. కొందరు రవిని దారుణంగా తిడుతుంటే.. మరికొందరు మాత్రం అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రవి బయటకు వస్తేనే కొత్త సినిమాలను ఐబొమ్మలో చూడొచ్చని కాబట్టి అతన్ని విడుదల చేయాలని నెటిజన్లు వీడియోలు చేస్తున్నారు. అలాగే కొంతమంది మాత్రం టికెట్ రేట్స్ పెంచడం వల్లే ఐబొమ్మ రవిలాంటి వాళ్లు సినీ ప్రియులకు న్యాయం చేసేందుకు ఐబొమ్మ ద్వారా పైరసీ చేశాడని సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు. అంతగా టికెట్ ధరలు ఉంటే.. చూసేందుకు వెల్లకండి అన్న రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
అలాగే మీకు కంఫర్ట్‌గా ఉండాలంటే.. డబ్బులు కట్టకుండా.. ఏదీ రాదని అంటున్నారు. తాజాగా, ఈ విషయంపై టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ (SKN)ఓ ట్వీట్ పెట్టాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni)నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka)నవంబర్ 28న గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ఈ సినిమా శ్రీరాములు థియేటర్‌లో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలిపారు. మూసపేటలోని శ్రీరాములు థియేటర్ టికెట్ ధరలు, క్యాంటీన్ రేట్ల గురించే SKN ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు టికెట్ రేటు - రూ.150, పాప్ కార్న్ - రూ.70, కేక్ - రూ.25, ఆలూ సమోసా - రూ.30, లేస్ ప్యాకెట్ - రూ.18ఉంది’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా దానికి మెనూ కూడా జోడించాడు. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.
అది చూసిన నెటిజన్లు ..బాత్‌రూంకి పోయి చూడు ఒకసారి నీ జీవితంలో మళ్లీ వెళ్లకు అని కౌంటర్లు వేస్తున్నారు. ఇక అది చూసిన నిర్మాత అవునా అక్కడికే ముందు వెళ్లి వచ్చాను చాలా బాగున్నాయని రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్.. సింగిల్ స్క్రీన్‌పై ఈ రేట్టుల ఉన్నాయి. కానీ మల్టీప్లెక్స్‌లో అలా లేదంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై స్పందించిన ఎస్‌కేఎన్.. మీకు కంఫర్లబుల్‌గా ఉండాలంటే ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది కదా.మీరు కట్టేది మూవీ కోసం కాదు.. మీకు కంఫర్ట్‌గా ఉండేందుకు. కంఫర్టబుల్ రేట్ ఉన్న మల్టీప్లెక్స్ కంటే.. ఇంటిపక్క థియేటర్‌లోనే చూడాలి. లగ్జరీగా ఉన్న థియేటర్‌లో చూడాలంటే.. రేటు పెట్టక తప్పదు. దీనివల్ల ప్రొడ్యూసర్‌కి వచ్చే బెనిఫిట్ ఏం ఉండదు. మన కంఫర్ట్ కోసమే.. అంతేకానీ ఫిల్మ్ మేకర్స్‌ని బ్లేమ్ చేయడం తప్పు’అని స్ట్రాంగ్ రిప్లైతో నెటిజన్ నోరుమూయించాడు.






