- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush Review :ఆదిపురుష్’ ఫైనల్ అవుట్‌పుట్ చూసి.. ఫస్ట్ రివ్యూ చెప్పిన దిల్ రాజు
ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి.

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా జూన్ 6న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘జై శ్రీ రామ్’ అనే పాట సెన్సేషన్ క్రియేట్ చేయగా.. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ కూడా సిద్ధం అయిపోయిందట. రీసెంట్‌గానే ప్రసాద్ ల్యాబ్స్‌లో దీనికి సంబంధించిన ఫైనల్ ఔట్‌పుట్ చూసిన దిల్ రాజు మొదటి రివ్యూ ఇచ్చాడు. ‘మూవీ చాలా అద్భుతంగా ఉంది. అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించారు. రామాయణంపై ఇప్పటివరకు వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో సరికొత్త టెక్నాలజీతో రామాయణం చూపించారు. కచ్చితంగా ఆడియన్స్‌కి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది’ అన్నారు దిల్ రాజు.






