- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సినిమా టైటిల్ ప్రకటించి హైప్ పెంచిన ప్రీతి అస్రాని.. ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్న నెటిజన్లు
యంగ్ హీరోయిన్ ప్రీతి అస్రాని(Preethi Asrani) ఇటీవల ‘కిస్’చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ప్రీతి అస్రాని(Preethi Asrani) ఇటీవల ‘కిస్’చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తోంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాల్లో ఎస్ జే సూర్య ‘కిల్లర్’ ఒకటి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలాఉంటే.. తాజాగా, ప్రీతి అస్రాని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ సినిమా క్రిష్ణ బలరాం(Krishna Balaram) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. స్క్వేర్ సినిమాస్ బ్యానర్‌పై రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఇందులో ముగెన్ రావు హీరోగా నటిస్తుండగా.. ప్రీతి అస్రాని, తాన్యా హోప్(Tanya Hope) హీరోయిన్లుగా నటిస్తుండగా.. నితిన్ సత్య, గజరాజ్, కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కొన్ని నిజమైన కథల ఆధారంగా రాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘నిరమ్’ (Niram)టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ప్రీతి అస్రాని రక్తంతో రాసినట్లు ఉన్న పోస్టర్లను షేర్ చేసింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇక టైటిల్ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






