Salaar Teaser Update : రేపే ప్రభాస్ 'సలార్' టీజర్ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2023-07-08 12:47:34  IST  )

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పవర్ ప్యాక్ కాంబినేషన్ లో వస్తున్న డైరెక్ట్ మూవీ 'సలార్'. మరికొద్ది గంటల్లోనే టీజర్ విడుదల కాబోతోంది.

Salaar Teaser Update : రేపే ప్రభాస్ సలార్ టీజర్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పవర్ ప్యాక్ కాంబినేషన్ లో వస్తున్న డైరెక్ట్ మూవీ 'సలార్'. మరికొద్ది గంటల్లోనే టీజర్ విడుదల కాబోతోంది. రేపు ఉదయం 5.12 గంటలకు సలార్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు వేయి కన్నలతో వేచి చేస్తున్నారు. 90 సెకన్ల నిడివితో టీజర్ ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అసలే పాన్ ఇండియా డైరెక్టర్ పాన్ ఇండియా స్టార్ హీరోతో తీస్తున్న 'సలార్' సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా రాబోతున్న సలార్ సినిమా టీజర్ కేజీఎఫ్, బాహుబలిలా కలిసి పవర్ ప్యాక్ గా ఉండబోతోందని ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడెల్ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story