Ram Charan తో సినిమా చేస్తా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 10 |
Ram Charan తో సినిమా చేస్తా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళిలతో పనిచేయడం గురించి ప్రభాస్ ఇట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్ డియాగో కామిక్ కాన్’ ఈవెంట్లో ఆయన నటిస్తు్న్న తాజా చిత్రం ‘కల్కి 2899 ఏడీ’ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రభాస్.. ‘భారత్‌లో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ‘ఆర్ఆర్ఆర్’ చాలా గొప్ప సినిమా. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం ఆనందాన్నిచ్చింది. భారతదేశానికి దక్కిన గౌరవంగా భావించాం. రాజమౌళి దానికి అర్హుడు. చెర్రీ నాకు మంచి స్నేహితుడు. మేము ఇద్దరం కలిసి ఏదో ఒక రోజు కలిసి సినిమా చేస్తాం’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ప్రభాస్, చెర్రీ కాంబోలో మూవీ వస్తే సినమా చరిత్రలోనే బిగ్ మల్టీ స్టారర్ అవుతుందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఈ రేంజ్‌ వెల్‌కమ్‌‌ను అస్సలు ఊహించి ఉండరు (వీడియో)

Next Story

Most Viewed