- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్‌గా మెగా హీరో..? ఈ సారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’(Spirit).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’(Spirit). దీనిని టీ- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా హై బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ ఇయర్ నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుండగా.. ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ చేశారు. అయితే ప్రభాస్ సరసన హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ రాశి ఖన్నా(Rashi Khanna), కీ రోల్‌లో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan), కరీనా కపూర్(Kareena Kapoor) ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఇక ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పిరిట్ మూవీలో విలన్‌గా మెగా హీరో అయినటువంటి ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించనున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సందీప్ రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేశారని, వరుణ్‌కు తన క్యారెక్టర్ గురించి వివరించారని సమాచారం. కాగా దీనిపై మూవీ టీమ్ స్పందిచాల్సి ఉంది. ఏదీ ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా..ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే ఈ సారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






